PRABHA MANAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:57 pm Posted by : PRABHA MANAM

ఏపీకి రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులు

 

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వ‌హించారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించారు. మొత్తం 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు బోర్డు ముందుకు వచ్చాయి. ప్రతిపాదిత ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.