ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
మాధవరం సమీపంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి కర్నూలు, జూన్ 23,ప్రభ మనం,న్యూస్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.మంగళవారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామం సమీపంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి గురువారం మంత్రాలయం లో పర్యటించే అవకాశం ఉన్నందున సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమన్వయంతో, ఎటువంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని అధికారులను...