PRABHA MANAM
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:34 am Posted by : PRABHA MANAM

ప్రధాన రహదారిపై డ్రైనేజీ మురికి నీరు

డ్రైనేజీ నీరు రోడ్డుపై మురికి నీరు పారడంతో అస్త వ్యస్త్రంగా మారిన ప్రధాన రహదారి

ఈ గబ్బు వాసనతో కాలనీ వాసులు ఎన్నాళ్లు భరించాలి..

పట్టించుకోని ప్రభుత్వ శాఖ అధికారులు..

పెద్దకడుబూరు, ఆగస్ట్,30,ప్రభ మనం

మండల పరిధిలోని కమ్మలదిన్నె గ్రామంలో స్థానిక జడ్పీహెచ్ హై స్కూల్ సమీపంలో ఉన్న ప్రధాన రహదారిపై దాదాపు 20 రోజులు కావస్తున్న డ్రైనేజీ,మురికి నీరు ప్రధాన రహదారిపై పారడంతో అస్తవ్యస్త్రంగా మారి,ఈ గబ్బు వాసనతో కాలనీ వాసులు ఎన్నాళ్లు భరించాలనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా డ్రైనేజీలో
మూసుకుపోయిన చెత్త చెదరాన్ని తొలగించి ప్రధాన రహదారిపై మురికి నీరు అక్కడ నిలువకుండా,పారకుండా,
అలాగే ప్రజలకు అంటురోగాలు బారిన పడుకోకుండా ఉండాలంటే డ్రైనేజీ లో ఉన్న చెత్తను,పూడికను తొలగిస్తారా లేదా వేచి చూద్దాం.. ఈ వార్తకు ప్రభుత్వ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం మరి..