రూ.2.75 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం* *పెరవలిలో ప్రారంభించిన ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ – రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న హామీ*

  మద్దికేర, ఆగస్టు 1 ( ప్రభ మనం,న్యూస్) మద్దికేర మండల పరిధిలోని పెరవలి గ్రామంలో రూ.2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ ఉపకేంద్రం ద్వారా పెరవలి, బసినేపల్లి, రామాపురం, రామాపురం కొట్టాల, మదనతపురం గ్రామాలకు మెరుగైన...