PRABHA MANAM
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 8:54 pm Posted by : PRABHA MANAM

మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి : వైఎస్ జగన్

 

ప్రజా సమస్యలపై శాసన మండలిలో గట్టిగా పోరాడాలన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాల‌ని పేప‌ర్ లీక్‌కు నైతిక బాధ్య‌త వ‌హిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9,100 కోట్లకు చేరాయని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీని ఎత్తివేశారని విమర్శించారు. కొత్త పీపీపీ విధానం ‘ఏపీ ఫర్ సేల్’లా ఉందని విమ‌ర్శించారు. తాగునీరు, పాఠశాలలు, ఆస్పత్రులను పీపీపీ విధానంలోకి తీసుకురావద్దన్నారు. బీసీ నాయకులపై కక్షపూరిత కేసులు పెడుతున్నారని మండిప‌డ్డారు.