PRABHA MANAM
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:30 pm Posted by : PRABHA MANAM

మొహరం పండుగకు పోలీసులు అనుమతి తప్పనిసరి….!!

 

శాంతియుతంగా పండుగ జరుపుకుందాం

:—– పోలీసుల సూచనలు పాటిద్దాం

:—– మతసామరస్యాన్ని కాపాడుకుందాం

మండల యెస్ ఐ,మారుతి వెల్లడి….

పెద్దకడుబూరు, జూన్,19,ప్రభ మనం

మండలంలోని ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు ఈ నెల 26,వ తేదిన జరుగనున్న మొహర్రం వేడుకలకు పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ,మారుతి తెలియజేశారు. పెద్దకడుబూరు లో స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ,మారుతి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా గ్రామాల్లో మొహర్రం పండుగను నిర్వహించాలనుకునేవారు ముందుగా పోలీసుల నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోని మీసేవ కేంద్రాల్లో చలాన కట్టి రసీదు పొందాలని
తెలియజేశారు.ఏటువంటి అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించిన,సమస్యలు వచ్చిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే మొహరం పండుగను శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని కోరారు. మన దేశం, మన రాష్ట్రం, మన మండలం మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని,అలాయ్ తొక్కే కార్యక్రమాల సమయంలో
ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలనీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎటువంటి చర్యలకు పాల్పడకూడదనీ
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా గొడవలకు పాల్పడిన అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని యెస్ ఐ,విలేకరులకు తెలిపారు.