స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : పవన్ కళ్యాణ్

  స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఎమ్మెల్యేలు సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలాన్ని చాటేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు.