మంత్రాలయం , జూలై 7,మనం న్యూస్ ;-
మంత్రాలయం మండల పరిధిలోని సూగూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ కార్యకర్త చాకలి గోవిందు (55 ) అనారోగ్యంతో గత రాత్రి మరణించారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డి , వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి ,మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి తో కలిసి గ్రామానికి వెళ్ళి గోవిందు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చులకై రూ. 10 వేలు కుటుంబ సభ్యులకు అందచేశారు. వారి కుటుంబానికి రాంపురం రెడ్డి సోదరులు ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి తో పాటు గ్రామ నాయకులు దేవదాసు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు…