PRABHA MANAM
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 6:24 pm Posted by : PRABHA MANAM

2029 ఎన్నికల్లో పోటీ చేయను : రాచమల్లు శివప్రసాద్

ప్రభ మనం న్యూస్

AP: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు నిరూపిస్తే 2029 ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. కార్పొరేట్ వ్యాపారులకు తాము వ్యతిరేకమని, స్థానిక వ్యాపారులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.