తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 16న తిరుమలలో మహా పుష్పయాగం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ యాగానికి టికెట్లు పొందిన భక్తులకు ఒకే రోజు రెండు సార్లు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఉదయం 6 గంటలకు మొదటి దర్శనం, తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మహా పుష్పయాగం టికెట్లను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

