ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పాలసీని విడుదల చేసింది. 91 పేజీల పాలసీ డాక్యుమెంట్‌లో భాగస్వామ్య ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రభుత్వం సమగ్రంగా పొందుపరిచింది. 51 శాతానికి పైగా ప్రైవేటు వాటా ఉండే ప్రాజెక్టులను కూడా ఈ పాలసీ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల సమీకరణ కోసం మొత్తం 18 రకాల పద్ధతులను పాలసీలో చేర్చింది. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

