Saturday, August 15, 2026
Homeఆంధ్రప్రదేశ్కృష్ణ డెల్టాకు గోదావరి నీరు: చంద్రబాబు

కృష్ణ డెల్టాకు గోదావరి నీరు: చంద్రబాబు

📰 Generate e-Paper Clip

 

జీఎస్డీపీ, జూలై ఆర్థిక నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఏపీ సానుకూల వృద్ధి సాధించిందన్నారు. 2025-26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. వ్యవసాయ రంగంలో 13.5 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి, పన్ను ఆదాయం రూ.13,282 కోట్లకు చేరిందన్నారు. ఎంఎస్‌ఎంఈల్లో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు కృష్ణా నదిలో ప్రవాహం తగ్గిందని, శ్రీశైలం, నాగార్జునసాగర్ పూర్తిగా నిండలేదన్నారు. గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నట్లు వివరించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!