ఏపీలో ‘నేతన్న సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. బాపట్ల జిల్లా కొత్తపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 71,536 చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను జమ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత కార్మికులు అండగా నిలిచారని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు.

