తుగ్గలి, ఆగస్టు 5 ( ప్రభ మనం న్యూస్):
ఏపీ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి చెక్క పక్కీరప్ప బుధవారం విజయవాడ సమీపంలోని మంగళగిరిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఆయన మాజీ ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, దళితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్లు పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దళితుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పినట్లు చెక్క పక్కీరప్ప తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, బాధితులకు అండగా నిలిచే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు వెల్లడించారు.
అనంతరం చెక్క పక్కీరప్ప మాట్లాడుతూ, దళితుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యలను సంబంధిత వేదికలపై ప్రస్తావిస్తూ న్యాయం జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

