Saturday, August 15, 2026
Homeఆంధ్రప్రదేశ్సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తా: మాజీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం చెక్క...

సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తా: మాజీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం చెక్క శ్రీను*

📰 Generate e-Paper Clip

 

తుగ్గలి, ఆగస్టు 5 ( ప్రభ మనం,న్యూస్):

తుగ్గలి మండలంలోని చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు చెక్క శ్రీను బుధవారం మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తుగ్గలి మండలంతో పాటు చిన్న జొన్నగిరి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానిక పరిస్థితులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాజీ ముఖ్యమంత్రికి వివరించినట్లు చెక్క శ్రీను తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
అనంతరం చెక్క శ్రీను మాట్లాడుతూ, ప్రజలతో ఎల్లప్పుడూ అండగా వారి కష్టాల్లో  నిలవాలని, సేవా దృక్పథంతో ముందుకు సాగాలని మాజీ ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా నిరంతరం పనిచేయాలని ఆయన ఇచ్చిన సందేశం తనకు మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా కలిసి ఆశీస్సులు పొందడం తన రాజకీయ జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని చెక్క శ్రీను పేర్కొన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తూనే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రికి చెక్క శ్రీను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!