Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్అశేష అభిమానులు, సమక్షంలో ఘనంగా నరవ దంపతుల వివాహ దినోత్సవ వేడుకలు

అశేష అభిమానులు, సమక్షంలో ఘనంగా నరవ దంపతుల వివాహ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

:—- వేడుకను సేవా కార్యక్రమంగా మార్చిన నరవ దంపతులు..

:—- జెడ్పీ.పి.హెచ్‌.ఎస్ విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

 

 

పెద్దకడబూరు,జూలై,15,ప్రభ మనం న్యూస్

 

 

ప్రజాసేవను జీవిత ధ్యేయంగా ఎంచుకుని ప్రజల మన్ననలు పొందుతున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి నరవ శశిరేఖ, నరవ రమాకాంత్ రెడ్డి దంపతుల వివాహ దినోత్సవ వేడుక, పెద్దకడబూరు,వారి స్వగృహం నందు,సన్నిహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నరవదంపతులు కేక్ కట్ చేయగా అభిమానులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ అనుగ్రహంతో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలని అభిమానులు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ, “ప్రజల ప్రేమ, అభిమానుల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవా మార్గంలో మరింత అంకితభావంతో పనిచేస్తాం. ప్రతి కుటుంబానికి చేరువై ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.వివాహ దినోత్సవాన్ని కేవలం వేడుకకే పరిమితం చేయకుండా సామాజిక బాధ్యతతో నిర్వహించడం విశేషంగా నిలిచింది. “పూలమాలలు – శాలువాలు వద్దు… విద్యా సామగ్రి ముద్దు” అనే వినూత్న పిలుపునకు స్పందించిన అభిమానులు అందించిన పెన్నులు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రిని పెద్దకడబూరు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు పెన్నులు అందజేసి విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందని దంపతులు సూచించారు.
నరవ దంపతుల ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అభినందిస్తూ, వ్యక్తిగత వేడుకలను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలుగా మార్చడం అందరికీ ఆదర్శమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు,,కంబళదిన్నే, మేకడోణ, చిన్నకడబూరు, దొడ్డి మేకల,మురవని,పలు గ్రామాల,తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆధికసంఖ్యలో పాల్గొని నరవ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వివాహ దినోత్సవ కార్యక్రమానికి సింగల్ విండో చైర్మన్ టి ఆంజనేయులు ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయశారు ఎం.రామన్న ఆధ్వర్యంలో కేక్ పూలమాల శాలువా ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!