Tuesday, September 15, 2026
Homeఎడిటోరియల్యోగమే జీవన విధానం..

యోగమే జీవన విధానం..

📰 Generate e-Paper Clip

యోగమే జీవన విధానం..

 

పరిమళ విద్యానికేతన్‌లో విద్యార్థులతో కలిసి యోగ చేసిన మంత్రాలయం టిడిపి ఇన్చార్జి గారు.

మంత్రాలయం పట్టణంలోని పరిమళ విద్యానికేతన్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం మఠం మేనేజర్ ఎస్.కే. శ్రీనివాసరావు గారు, ఎంపీడీవో నూర్జహాన్ గారు, ఎంఈవో నాగభూషణం గారు, రాగన్న గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఇన్చార్జి గారు వివిధ యోగాసనాలు నిర్వహించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!