AP: తప్పుడు సమాచారంతో ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2026 సంవత్సరం పూర్తికాకముందే అక్షరాస్యత గణాంకాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో అక్షరాస్యత 72.6 శాతం మాత్రమేనని, 82.1 శాతానికి పెరిగిందనేది అసత్యమన్నారు. రెడ్‌బుక్ పాలనపై దృష్టి పెట్టకుండా విద్యారంగ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వైయస్ జగన్ సూచించారు

