GSLV-F17 మిషన్ విజయవంతం కావడంపై ఇస్రోను ఎక్స్ వేదికగా అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విజయం దేశానికి గర్వకారణమని, అంతరిక్ష రంగంలో భారత సాంకేతిక సామర్థ్యానికి మరో నిదర్శనమని పేర్కొన్నారు. EOS-05 ప్రయోగం భారత అంతరిక్ష రంగం ప్రగతి, ఆవిష్కరణలు, సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం ప్రధాని మోడీ చేయాలన్నారు.

