Saturday, August 1, 2026
Homeఆంధ్రప్రదేశ్సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం

సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం

📰 Generate e-Paper Clip

పార్టీ శ్రేణులకు ఆర్ అండ్ బి మంత్రి బిసి జనార్ధనరెడ్డి పిలుపు

బనగానపల్లె జూలై 7 ప్రభ మనం న్యూస్

 

 

బనగానపల్లె మండలం
రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో పర్యటిస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయల్దేరి బనగానపల్లె హెలిప్యాడ్ కు 11.20కి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద 11.20 నుంచి నుంచి 11.30 వరకు ప్రజల,అధికారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. 11:40 గంటలకు తహసిల్దార్ ఆఫీస్ చేరుకుని 12.15 వరకు అక్కడ అధికారులతో, రైతులతో సమీక్ష జరుపుతారు. 12.25 కు తహసీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరి సమీపంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక చేరుకుని 2.30 వరకు అప్పాలపురం, కాపులపల్లె రైతులకు మీ భూమి మీ హక్కు రీ సర్వే నూతన పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేసి ,అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిశాక 2.35 నుంచి 4.05వరకు పట్టణంలో పార్టీశ్రేణులతో సమావేశమవుతారు. పార్టీ శ్రేణులతో సమావేశం ముగిశాక 4.05 గంటలకు తిరిగి హెలిప్యాడ్ చేరుకుని హెలికాప్టర్ ద్వారా 5.40 కి ఉండవల్లి చేరుకుంటారు.

సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేద్దాం

పార్టీ శ్రేణులకు ఆర్ అండ్ బి మంత్రి బిసి జనార్ధనరెడ్డి పిలుపు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు 9న తొలిసారి నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లెకు మీ భూమి- మీ హక్కు రిసర్వే నూతన పట్టాదారు పాస్ బుక్ ల పంపిణీలో భాగంగా రానున్నారని తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూటమి మిత్రపక్షాలు ఆయన పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు

ఇది ఇలా ఉండగా మంత్రి బీసీజేఆర్ పట్టుదలతో గ్రామపంచాయతీ హోదా మాత్రమే ఉన్న బనగానపల్లె గత డిసెంబర్ లో పాలన పునర్విభజనలో భాగంగా నంద్యాల జిల్లాలో 5 మండలలతో 4వ నూతన రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటైన బనగానపల్లెకు తొలిసారి సీఎం రావటం , అదే రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష చేయనుండటం గమనార్హం

ఇక సీఎంకు తన సొంత నియోజకవర్గ కేంద్రంలో బీసీ జనార్ధనరెడ్డి ఆర్ అండ్ బి శాఖ మంత్రి హోదాలో స్వాగతం పలకనుండటం కూడా తొలిసారి కావడం విశేషం
అయితే ఇది ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని, ప్రజా నాయకుడి పర్యటనను విజయవంతం చేద్దామని ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో సిఎం రాక ఏర్పాట్లను సభావేదిక ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి సిఎం చంద్రబాబు రీ సర్వే పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ, అధికారులు, పార్టీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు
బనగానపల్లె పర్యటనకు వస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీఎం పర్యటనలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ శ్రేణులుకుడా పెద్దసంఖ్యలో పాల్గొని సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!