Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి

రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

  • — రైతు ఆర్థిక సహయం అందజేత
    మంత్రాలయం మండలంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
    వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ కుమార్ రెడ్డి
    మంత్రాలయం , జూలై 8,మనం ప్రతి న్యూస్;- రైతు బాంధవుడు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా రాఘవేంద్ర కూడలిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సృష్టికర్త పేదల గుండెల్లో నిలిచిన చిరస్మరణీయుడు డాక్టర్ వైయస్సార్ అని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ప్రదాత అన్నారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దాం అన్నారు. అలాగే మండలంలోని మాలపల్లి , రచ్చమర్రి , వగరూరు , తుంగభద్ర , ఖగ్గల్ , కాచాపురం , రాంపురం , తదితర గ్రామాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
    రైతు ఆర్థిక సహాయం అందించిన వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ రెడ్డి ;- ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా మంత్రాలయం గ్రామానికి చెందిన సురేష్ అనే రైతు వృషభాలు తుంగభద్ర నదిలో మునిగి మృతి చెందాయి. ఈ విషయాన్ని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ కుమార్ రెడ్డి దృష్టికి స్థానిక వైసీపీ నాయకులు తీసుకువెళ్ళారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రైతు సురేష్ కు రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.
    ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ భీమ్ రెడ్డి , మండల ఇంచార్జ్ విశ్వనాథరెడ్డి, న్యాయవాది లక్ష్మీనారాయణ రెడ్డి,మాజీ సర్పంచ్ భీమయ్య, కురువ మల్లికార్జున ,బొంబాయి శివ, , రొగప్ప ,రాఘవేంద్ర రవి రెడ్డి,మల్లికార్జున రాము, రామాంజనేయులు యోహాను, కాయ్యోను, తదితరులు పాల్గొన్నారు
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!