Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్వరుణ దేవునికోసం ఆశగా ఎదురుచూస్తున్న  అన్నదాతలు:

వరుణ దేవునికోసం ఆశగా ఎదురుచూస్తున్న  అన్నదాతలు:

📰 Generate e-Paper Clip

 

 

జూలై.8( ప్రభ మనం న్యూస్ ):మండలంలోని తుగ్గలి లో ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు రావడంతో అన్నదాతను మురిపించి మరిపించి పూర్తిగా ముంచేయడం జరిగింది. వర్షం వచ్చిందని అన్నదాత ముందుగానే తమ పంటను సాగు చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో సరైన సమయంలో వర్షాలు రాకపోవడంతో అన్నదాత ల ఆశలు ఆవిరై పోయాయి. భూమిలో నాటిన విత్తనాలు భూమిలోనే ఉండిపోయింది కొద్దిపాటి వర్షాన్ని కి మొలకెత్తిన మొక్క ఆకాశంగావరుణ దేవుడి కొరకు ఎదురుచూస్తుంది అయినా కూడా వరణదేవుడు కరుణ చూపకుండా అన్నదాతల జీవితాలలో చెలగాటము ఆడుతున్నాడు. తుగ్గలి మండలంలోని దాదాపు గా కొన్ని వేల ఎకరాల పైగా వర్షం పైనే ఆధారపడి పంటలను సాగు చేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు రావడంతో పత్తి మిరప విత్తనాలు వేరుశనగ ఉల్లిగడ్డ వంటి పంటలను రైతులు సాగు చేసుకుని ముందుగానే వేసుకున్న విత్తనాలు వర్షం రాకపోవడంతో విత్తనాలు భూమిలోనే మొలక వచ్చి ఎండిపోయాయి దాదాపు 45 రోజులు పైగా వర్షాలు రాకపోవడంతో అన్నదాతల గుండె చేరువై పోయింది దాదాపు గా ఎకరానికి ఐదువేల నుండి పది వేల వరకు విత్తనాలు ఎరువులు కు పెట్టుబడి పెట్టి పూర్తిగా అప్పులలో ఇరుక్కుపోయి అన్నదాత లు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి తోడుగా ఎరువుల ధరలు కూడా విరీతంగా పెరగడంతో అప్పులు చేసుకుని పంటలను సాగు చేసుకుని వరుణ దేవుడు మాత్రమే కరుణించలేదని బోరన విలపిస్తున్నారు.ఇప్పటికే వరణ దేవుడు రాక పంటలు ఎండిపోయి ఎడారిగా మారాయని అన్నదాత తన ఆవేదనను వ్యక్తి చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పంట పొలాలను పరిశీలించి కరువుమండలాలగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. అలాగే వరుణ దేవుడి రాక కోసం వేయి కళ్ళతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!