పెద్దకడుబూరు, జూన్,30,ప్రభ మనం,న్యూస్
మండల కేంద్రమైన పెద్దకడుబూరులో స్థానిక SC కాలనీకి చెందిన కుదె మారెప్ప,అనే వికలాంగుడు తమ పని నిమిత్తం కొరకు బ్యాంకు కోసం రోడ్డు మార్గంలో మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఆయనకు రోడ్డుపై ఒక పర్సు దోరికింది.ఆ పర్సుని చూడగా
అందులో రెండున్నర తులం బంగారం (ఒక నెక్లెస్, రెండు కమ్మలు, మావిటీలు) మరియు
రూ, 1300 రూపాయలు నగదు చూసుకొని అతను ఎవరో పోగొట్టుకున్నారని తెలుసుకొని
మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి బంగారు నగలు, 1300 నగదు అప్పజెప్పి తన నిజాయితీని చూపించాడు. బంగారు నగలు, నగదు గురించి విచారణ చేయగా పోగొట్టుకున్న చాకలి మధు, పెద్దకడుబూరు గా గుర్తించి, వారిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారికి నిజా నిజాలు విచారణ చేసుకొని, పోగొట్టుకున్న బంగారు నగలు, నగదును యెస్ ఐ ,మారుతి ఆధ్వర్యంలో వారికి అప్పజెప్పడమైనది,
అంతేకాకుండా నిజాయితీ చాటుకున్న కుదె మారెప్పను సన్మానించి వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది
పాల్గొన్నారు.

