Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్భూమా విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్

భూమా విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్

📰 Generate e-Paper Clip

నంద్యాల అభివృద్ధిలో భూమా నాగిరెడ్డి సేవలు

చిరస్మరణీయంశ్రీనివాస్ సెంటర్‌లో ప్రతిష్ఠించాలని టీడీపీ నేతలు, కార్యకర్తల విజ్ఞప్తి

నంద్యాల,జూలై,07,ప్రభ మనం న్యూస్

పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేసిన దివంగత మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి విగ్రహాన్ని శ్రీనివాస్ సెంటర్‌లో ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
భూమా నాగిరెడ్డి ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో నంద్యాల పట్టణంలోని పేద ప్రజలకు సుమారు 13 వేల గృహాలు మంజూరు చేయించారని వారు గుర్తు చేశారు. పట్టణ ప్రజలకు దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు పరిషారంగా అమృత పథకాన్ని తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాగే నూనెపల్లె నుంచి గాంధీచౌక్ వరకు రహదారి విస్తరణ పనులను చేపట్టి పట్టణ అభివృద్ధికి ఊతమిచ్చారని తెలిపారు. దీనితో పాటు పలు మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి నంద్యాల అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని అన్నారు.
నంద్యాల అభివృద్ధికి భూమా నాగిరెడ్డి చేసిన సేవలను భావితరాలకు చాటిచెప్పేలా శ్రీనివాస్ సెంటర్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.
.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!