Saturday, August 1, 2026
Homeఎడిటోరియల్పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

📰 Generate e-Paper Clip

పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

మహానంది, జూన్ 21,ప్రభ మనం న్యూస్

మహానంది పుణ్యక్షేత్రంలో భక్తురాలు పోగొట్టుకున్న బంగారు గొలుసును దేవస్థానం అధికారులు అందజేశారు. ఆదివారం హైదరాబాద్ కు చెందిన సంగీత కోనేరులో స్నానం ఆచరిస్తూ ఉండగా బంగారు తాళిబొట్ల గొలుసును జారవిడుచుకున్నారు.స్నానం అనంతరం ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.ఆలయ పర్యవేక్షకుడు సుబ్బారెడ్డి స్థానిక సిబ్బందిచే వెతికించి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు చేతులమీదుగా బాధితురాలికి అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!