AP: పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ . పరిశ్రమల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. ఇప్పటికే 26 పరిశ్రమల్లో 129 ఎకరాల్లో పచ్చదనం అభివృద్ధి చేశామని, తొలి విడత పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పారు. విశాఖ, శ్రీ సిటీ, పరవాడ ప్రాంతాల్లో పరిశ్రమల్లో 33 శాతం పచ్చదనం తప్పనిసరి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

