12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
గంగులపాడు గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాల నందు పంచాయతీ సెక్రటరీ శాంతకుమారి అధ్యర్యం లో ప్రాథమిక స్కూల్ ఆవరణం నందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహంచడం జరిగినది ఈకార్యకమం లో ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ బ్రాహ్మణ కార్పోరేషన్ డైరక్టర్ జి. కె. బాబురావు రావు స్వామి, గారు పాల్గొని విద్యార్థులుకు మరియు గ్రామ ప్రజలు అందరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా గ్రామ ప్రజల యోగాసనాలు వేస్తూ *12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉద్దేశం (Yoga for healthy ageing) వయసుకు* *తగ్గట్టు ఆరోగ్యం* ఉండాలని తెలియజేస్తూ యోగాని రోజూ ఒక గంట సేపు మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటే వైద్యానికి మించిన ఆరోగ్యం మన సొంతం అవుతుందని, మానసిక ప్రశాంతతకు యోగ ఒక వరం లాంటిదని, ఒక సంజీవిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల వ్యాప్తంగా యోగాను ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాట్లాడడం జరిగినది, ఈ కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జి. కె. వేంకట రాముడు, అంగన్వాడీ టీచర్లు ,కార్యకర్తలు, ఆశ వర్కర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

