Sunday, November 1, 2026
Homeఆంధ్రప్రదేశ్వైభవంగా జయతీర్థుల మధ్యారాధన వేడుకలు మంత్రాలయం , ఆగస్టు 3,(మనం న్యూస్) : కర్ణాటక రాష్ట్రం...

వైభవంగా జయతీర్థుల మధ్యారాధన వేడుకలు మంత్రాలయం , ఆగస్టు 3,(మనం న్యూస్) : కర్ణాటక రాష్ట్రం నవబృందావన గడ్డ పై వెలిసిన జయతీర్థుల

📰 Generate e-Paper Clip

మంత్రాలయం , ఆగస్టు 3,( ప్రభ మనం న్యూస్) : కర్ణాటక రాష్ట్రం నవబృందావన గడ్డ పై వెలిసిన జయతీర్థుల మధ్యారాధన వేడుకలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల అధ్వర్యంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. జయతీర్థుల బృందావనానికి పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చి , అనుగ్రహ సందేశం ఇచ్చారు. సంస్థాన పూజల్లో భాగంగా మూల రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చి దూప దీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులకు తప్త ముద్ర ధారణ చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు , భక్తులు తరలివచ్చారు. వారికి పీఠాధిపతులు ఫలమంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం లో జయతీర్థుల ఆరాధన వేడుకలు మఠం అధికారులు , పండితులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జయతీర్థుల బృందావనానికి అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం స్వర్ణ రథంపై జయతీర్థుల చిత్రపటాన్ని ఉంచి పూజలు చేసి మంగళహారతి ఇచ్చి మఠం ప్రాకారంలో భక్తులు హర్షధ్వనాలు మధ్య ,భాజభంత్రిల మధ్య మఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు.జయతీర్థుల ఆరాధన ను పురస్కరించుకుని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పూజలు చేసి మంగళహారతి ఇచ్చి సుందరంగా అలంకరించారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ,రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. ఈ ఉత్సవంలో మఠం ఏఏఓ మాధవ్ శెట్టి , మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు , వెంకటేష్ జోషి , సహయ మేనేజర్ ఐపి నరసింహ స్వామి , ఇంజినీర్ సురేష్ కోనపూర్ , పీఆర్వో హోనళ్ళి వ్యాసరాజస్వామి , జయతీర్థ స్వామి , రాఘవేంద్ర రావు , మఠం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!