Friday, July 31, 2026
Homeఆంధ్రప్రదేశ్​జంట మృతి కుటుంబానికి అండగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

​జంట మృతి కుటుంబానికి అండగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

📰 Generate e-Paper Clip

 

మట్టి ఖర్చుల నిమిత్తం ₹10,000 ఆర్థిక సాయం

​వైస్సార్సీపీ నాయకుల చేతుల మీదుగా బాధితులకు అందజేత

 

​పెద్దకడబూరు, జూలై 09,ప్రభ మనం

 

 

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన దళిత కుటుంబానికి చెందిన చార్లెస్ కుమారుడు, కోడలు బతుకుతెరువు కోసం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి వలస వెళ్లారు. అక్కడ పనికి వెళ్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.ఈ దారుణ విషయం తెలుసుకున్న మంత్రాలయం శాసనసభ్యులు శ్రీ వై.బాలనాగిరెడ్డి గారు తక్షణమే స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందులో భాగంగా, మృతుల అంత్యక్రియల (మట్టి) ఖర్చుల నిమిత్తం రూ,10,000 (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డిలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారికి, వైస్సార్సీపీ నాయకులకు మృతుని తండ్రి చార్లెస్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!