
AP: బలహీన వర్గాల కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం చంద్రబాబు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఆలయ నిర్మాణాలకు వినియోగించాలన్నారు. టీటీడీ విద్య, వైద్యం, చారిటీ సేవలను విస్తరించాలని సూచించారు. ప్రాణదానం ట్రస్టును అత్యుత్తమ వైద్య సేవల నమూనాగా తీర్చిదిద్దాలన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

