బుడద గొట్టు కొండలలో చిరుతపులిలు సంచారం
భయాందోళనలో.. గ్రామస్తులు,పొలాల రైతులు
పెద్దకడుబూరు,ఆగష్టు 22 ప్రభ మనం
పెద్దకడబూరు లో స్థానిక బుడుదగొట్టు కొండల్లో రెండు చిరుతపులిలు సంచరిస్తున్నాయని చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులు ప్రత్యేక నిగపెట్టి భయాందోళనకు గురయ్యారు.చిరుతపులిలు సంచారం చేయటం చూసి పొలాలకు అలాగే అటువైపు వెళ్లాలంటే దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
చిరుతపులిలు ఎక్కడ ఎవరి పొలంలో పడి వస్తుందోనని గ్రామ రైతులు బెంబేలెత్తుతు న్నారు.తమ గ్రామ కొండల్లో ఉన్న చిరుతపులులను బంధించి తమ పశువులు, గొర్రెలను కాపాడాలని ఫారెస్ట్ అధికారులకు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.గతంలో కూడా రెండు, పర్యాయాలు పొలాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు రైతులకు కనపడ్డాయని స్థానిక ప్రజలు తెలియజేశారు.ఈ చిరుత పులుల వల్ల తమకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు.ఇప్పటికైనా జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతపులుల జాడను గుర్తించి బంధించాలని అధికారులను గ్రామస్తులు కోరారు.

